హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఫిక్షనల్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నిజాయితీకి మారుపేరు’ అనేది ఉప శీర్షిక. జూలై 4 అల్లూరి సీతారామరాజు 125 జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తూ ‘అల్లూరి’ టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ”ఎక్కడి దొంగలు…