Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేతలే టార్గెట్ గా పని చేసినట్లు తెలుస్తుంది.
Phone Tapping : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) దర్యాప్తు మరింత వేగంగా సాగుతోంది. ఇప్పటికే అనేకమంది అధికారులను విచారించిన సిట్, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న మాజీ ఎస్ఆర్ఎస్ అధికారి ప్రణీతరావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావులను విచారణకు పిలిచింది. రేపు ప్రణీతరావు, ఎల్లుండి ప్రభాకర్ రావు హాజరుకావాలని సిట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అత్యంత సంచలనంగా మారిన అంశం.. రెండు టెరాబైట్ల…
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ప్రభాకర్ రావును 9 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. జూన్ 14న మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు. నేడు సుదీర్ఘంగా ప్రభాకర్ రావుని సిట్ ప్రశ్నించింది. చాలా ప్రశ్నలకు ఎస్ఐబీ మాజీ చీఫ్ సమాధానాలను దాటవేశారు. కొన్ని ప్రశ్నలకు అధికారికం, వ్యక్తిగతం అంటూ సమాధానాలు ఇచ్చారు. ఇంకొన్ని వాటికి అయితే తెలీదు, గుర్తులేదు అంటూ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగింది. సిట్ అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు విచారించారు. ప్రభాకర్ రావుపై డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేటి విచారణ ముగియగా.. జూన్ 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు సూచించారు. విచారణకి ఎప్పుడు పిలిచినా…
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు మామూలోడు కాదని, భార్యాభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్ అని పేర్కొన్నారు. తమ లాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు ప్రభాకర్ పోసుకున్నాడన్నారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యిందని.. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారన్నారు. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన…
రెండు కుటుంబాలను ఆగం చేసిన వివాహేతర సంబంధం మెదక్ జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హావేలి ఘనపూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన నరేష్ (31), సునీత (28) మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇద్దరికీ కుటుంబాలు ఉన్నప్పటికీ, వారి సంబంధం తీవ్రతరమైంది. నరేష్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉండగా, సునీతకూ భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిసిపోయింది. పెద్దలు పంచాయతీ…
Prabhakar Rao : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్‌లోని ప్రత్యేక విచారణ బృందం (SIT) ఎదుట సోమవారం హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఆయన ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో అనేకమంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాకర్ రావు నుండి కీలక సమాచారం వెలుగులోకి వచ్చే…
నేడు సూర్యాపేట జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న భట్టి, పొన్నం. నేడు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో షైనింగ్ స్టార్స్ అవార్డులు. టెన్త్, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి షైనింగ్ స్టార్స్ అవార్డులు. నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సత్కారం. నేడు ఖమ్మం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న తుమ్మల,…
Prabhakar Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం రాత్రి చేరుకున్నారు. 15 నెలల విరామం తర్వాత ఆయన స్వదేశానికి పయనించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్ అధికారుల ఎదుర్కొన్నారు. లుకౌట్ నోటీసులు అమలులో ఉండటంతో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ స్కానింగ్ సమయంలో అధికారులకు…
దారుణ హత్య.. ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు..! అనంతపురం నగరంలో మరోసారి నరమానవత్వం కలవరపెట్టే ఘటన జరిగింది. ఇంటర్ సెకెండియర్ చదువుతున్న ఓ యువతి దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యచేశారు. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అమానవీయ సంఘటన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణిపాల్ స్కూల్ వెనుక భాగంలో చోటు చేసుకుంది. అక్కడ ఓ విద్యార్థినీ…