రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. Npdcl, Spdcl తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ కు వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్ళు కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదనపు అప్పు పొందేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు గానూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్థాన్‌కు కూడా అదనపు అప్పుల పరిమితి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.7,309 కోట్ల అదనపు అప్పులు తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,123 కోట్లు, రాజస్థాన్‌కు రూ.5,186 కోట్లు అదనపు అప్పుల పరిమితి పెంచుతున్నట్లు పేర్కొంది. 2021-22…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేషనల్ కోర్దినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ అధ్వర్యంలో కేటీపీపీ 11వందల మెగావాట్ల ప్రధాన ద్వారం ముందు అన్నీ అసోసియేషన్లు,ట్రేడ్ యూనియన్ల సిబ్బందితో నిరసన చేపట్టారు. విద్యుత్తు సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని జాతీయ విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ (ఎన్సీసీఓఈఈఈ) పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్…