జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేషనల్ కోర్దినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ అధ్వర్యంలో కేటీపీపీ 11వందల మెగావాట్ల ప్రధాన ద్వారం ముందు అన్నీ అసోసియేషన్లు,ట్రేడ్ యూనియన్ల సిబ్బందితో నిరసన చేపట్టారు. విద్యుత్తు సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని జాతీయ విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ (ఎన్సీసీఓఈఈఈ) పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్…