(సెప్టెంబర్ 11తో ‘ముద్దమందారం’కు 40 ఏళ్ళు) మాటల రచయితగా పలు పదవిన్యాసాలతో ఆకట్టుకున్నారు జంధ్యాల. “అడవిరాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు” వంటి కమర్షియల్ హిట్స్ కు సంభాషణలు పలికించి జనానికి సంతోషం పంచిన జంధ్యాల ‘సిరిసిరిమువ్వ, శంకరాభరణం’వంటి కళాత్మక చిత్రాలకూ పండితపామరుల ఆకట్టుకొనే రచన చేశారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాసి, నటించి, దర్శకత్వం వహించిన జంధ్యాల మనసు సినిమాకు దర్శకత్వం వహించాలని కోరుకుంది. తత్ఫలితంగానే ‘ముద్దమందారం’ చిత్రం రూపొందింది. తాను తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం…