“పొన్నియిన్ సెల్వన్” కొన్ని దశాబ్దాలుగా చాలా మంది చిత్రనిర్మాతల కలల ప్రాజెక్ట్. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి క్లాసిక్ నవల ఇది. “పొన్నియిన్ సెల్వన్” సినిమాను మణిరత్నం 1995లో కల్కి కృష్ణమూర్తి రాసిన దక్షిణాన పవర్ ఫుల్ రాజు రాజరాజ చోళుని కథ “పొన్నియన్ సెల్వన్” నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్ లో భారీ బడ్జెట్ తో, దిగ్గజ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్,…
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం “పొన్నియిన్ సెల్వన్” సెట్‌లో ఇటీవల ఓ గుర్రం మరణించింది. తాజా మీడియా కథనాల ప్రకారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో మణిరత్నం నిర్మాత సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, గుర్రం యజమాని అయిన హైదరాబాదీ వ్యక్తిపై పెటా ఇండియా ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు పిసిఎ చట్టం సెక్షన్ 429, ఐపిసి 1960 సెక్షన్ 111860 కింద కేసు…
అందాల తార ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం “పొన్నియన్ సెల్వన్” చిత్రంలో నటిస్తోంది. మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఐశ్వర్య, మణిరత్నం కాకలిసి మంచి హిట్‌లు అందించారు. “పొన్నియన్ సెల్వన్”తో చాలాకాలం తరువాత సౌత్ స్క్రీన్స్ పై మెరవడానికి సిద్ధమవుతోంది ఐష్. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడంతో సినిమాపై ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో సినిమా సెట్స్ నుంచి ఐశ్వర్య లుక్ బయటకు వచ్చింది. ఈ పిక్ లో ఐశ్వర్య ఎరుపు రంగు…
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో గాయాల పాలైన ప్రకాష్ రాజ్ చేతికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ చికిత్స తరువాత ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే సినిమా షూటింగ్ లో పాల్గొనడం ప్రారంభించారు. దానికి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్వాలియర్ విమానాశ్రయంలో దర్శకుడు మణిరత్నం, నటులు కార్తీ మరియు ప్రకాష్ రాజ్ చిత్రాలు హల్ చల్ చేస్తున్నాయి. Read Also…
మణిరత్నం తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వం’. ఇది రెండు భాగాలుగా రాబోతోంది. తొలిభాగం 2022 వేసవికి విడుదల కానుంది. ఈ పీరియాడిక్ డ్రామా లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన తారాగణం. ఇక ఈ సినిమాకు మణి ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే మణితో దశాబ్దాల అనుబంధం ఉన్న గేయరచయిత వైరముత్తు ఈ చిత్రానికి పని చేయటం లేదు. దీనికి కారణం అతడిపై వచ్చిన…
ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బలమైన పాత్రల్లో నటిస్తున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్’లో జయమ్మగా మాస్‌ను మెప్పించి ఆమె, ఆ తర్వాత ‘నాంది’లో లాయర్ ఆద్యగా అదరగొట్టారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్ళిపోతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్, హీరో అభిషేక్ బచ్చన్ ను కలవడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ…
కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను వెండితెరపై ఆవిష్కరించాలని చాలామంది దర్శకులు ఎంతో కాలంగా కలలు కంటున్నారు. అయితే.. దాన్ని సాకారం చేసుకుంటోంది మాత్రం ప్రముఖ దర్శకుడు మణిరత్నమే. ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తొలిభాగానికి సంబంధించిన నయా పోస్టర్ ను సోమవారం విడుదల…