మణిరత్నం తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వం’. ఇది రెండు భాగాలుగా రాబోతోంది. తొలిభాగం 2022 వేసవికి విడుదల కానుంది. ఈ పీరియాడిక్ డ్రామా లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన తారాగణం. ఇక ఈ సినిమాకు మణి ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే మణితో దశాబ్దాల అనుబంధం ఉన్న గేయరచయిత వైరముత్తు ఈ చిత్రానికి పని చేయటం లేదు. దీనికి కారణం అతడిపై వచ్చిన లైంగిక ఆరోపణలు.
మణిరత్నం దర్శకుడైన తొలినాళ్ల నుంచి అతగాడి సినిమాలకు పాటలు రాస్తూ వచ్చాడు వైరముత్తు. మణి మూడో సినిమా ‘ఇదయకోవిల్’ నుంచి వీరిద్దరి అనుబంధం ‘చెక్కా వసంత వానం’ వరకూ కొనసాగింది. మూడు దశాబ్దాలకు పైగా వైరముత్తు పాట లేకుండా తొలిసారి సినిమా తీస్తున్నాడు మణిరత్నం. కేవలం వైరముత్తుపై వచ్చిన లైంగిక ఆరోపణలే అందుకు కారణం. రెండు భాగాల పొన్నియన్ సెల్వం లో ఇలంగో కృష్ణన్ ఎనిమిది పాటలు రాయగా… కపిలన్ నాలుగు పాటలు రాశారు. మరి లైంగిక ఆరోపణ కారణంగా వైరముత్తుతో ముప్ఫై ఏళ్ళ అనుబంధాన్ని పక్కన పెట్టి మణిరత్నం ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూద్దాం.