“పొన్నియన్ సెల్వన్” షూటింగ్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“పొన్నియిన్ సెల్వన్” కొన్ని దశాబ్దాలుగా చాలా మంది చిత్రనిర్మాతల కలల ప్రాజెక్ట్. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి క్లాసిక్ నవల ఇది. “పొన్నియిన్ సెల్వన్” సినిమాను మణిరత్నం 1995లో కల్కి కృష్ణమూర్తి రాసిన దక్షిణాన పవర్ ఫుల్ రాజు రాజరాజ చోళుని కథ “పొన్నియన్ సెల్వన్” నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్ లో భారీ బడ్జెట్ తో, దిగ్గజ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ప్రభు, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, కిషోర్, జయరామ్, లాల్, రెహమాన్ తదితరులు నటిస్తున్నారు. “పొన్నియిన్ సెల్వన్”ను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్‌ల కింద అల్లిరాజా సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవివర్మన్ కెమెరా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బృందా మాస్టర్ కొరియోగ్రాఫర్, షామ్ కౌశల్ యాక్షన్ సీక్వెన్స్‌లను నిర్వహిస్తున్నారు.
Read Also : తల్లిదండ్రులతో పాటు వారిపై తలపతి కేసు
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దేశ వ్యాప్తంగా షూటింగ్ ను జరుపుకుంది. ఈ చిత్రం చివరి షెడ్యూల్ మధ్యప్రదేశ్, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది. క్లైమాక్స్ సన్నివేశాలను పొల్లాచ్చిలో చిత్రీకరించారు. దీనితో సినిమా మొదటి భాగం పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. జయం రవి మొదట రెండు భాగాల సినిమా షూటింగ్ పూర్తి చేయగా, విక్రమ్, కార్తి పార్ట్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. తాజాగా సినిమా చిత్రీకరణ పూర్తయ్యిందని ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను పంచుకున్నారు. దీంతో ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల్లో సంతోషం రెట్టింపు అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభం కావడంతో మద్రాస్ టాకీస్ సినిమా మొదటి భాగం 2022 సమ్మర్‌లో బిగ్ స్క్రీన్‌లలోకి రాబోతుందని ప్రకటించింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!