Ponnam Prabhakar : హైదరాబాద్ నగరంలో ప్రజల మధ్యకు వెళ్లి ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ , రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కలిసి RTC బస్సులో సాధారణంగా టికెట్ తీసుకొని ప్రయాణించారు. పంజాగుట్ట నుంచి లక్డికపూల్ వరకు బస్సు ప్రయాణం చేస్తూ, వారు ఇతర ప్రయాణికులతోపాటు మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహా లక్ష్మి…
అధిక తూకం లేకుండా, ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండా.. చర్యలు తీసుకోవడంతో పాటు పేమెంట్ ఆలస్యం కాకుండా వెంట వెంటనే రైతుల ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Minister Ponnam: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముక్తకంఠంతో సైన్యానికి దేశం మొత్తం సంఘీభావం తెలిపిన కేంద్ర ప్రభుత్వం పోరాటం ఆపివేయడం తీవ్రంగా కలిచివేసింది అన్నారు. మన సైనికులు చేసిన పోరాటం ఎటువంటి కార్యరూపం దాల్చాక ముందే.. ఒక్క ట్విట్టర్ తో దేశ సార్వబౌమత్వాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారు ప్రధాని మోడీ.
Ponnam Prabhbakar : బీసీల (BCs) హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై ఎవరైనా సందేహాలుంటే, తాము వాటిని స్వయంగా ప్రధాని సమక్షంలోనైనా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో పారదర్శకంగా, లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కులగణన నిర్వహించామని, ప్రత్యేక కమిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ…
Ponnam Prabhakar: నేడు ఉదయం పాకిస్తాన్ పై భారత్ చేసిన ‘ఆపరేషన్ సింధూరం’ విజయం కావడంతో దేశమంతటా విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ “ఆపరేషన్ సింధూర్” విజయవంతంపై హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన హర్షం వ్యక్తం చేసారు. భారత్ మాత కి జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానిస్తూ.. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్…
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో అన్ని సమస్యల పరిష్కారాలపై చర్చించినట్లు తెలిపింది. మంత్రి హామీతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, మంత్రి హామీతో సమ్మె తాత్కాలికంగా విరమించుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్ లో సమ్మె తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి దశల వారీగా పరిష్కారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఈరోజు, రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని తెలిపారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు.…
TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సమ్మె నోటీసుపై స్పందిస్తూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మెపై పునరాలోచించాలని కోరారు. ఈ సమయంలో ఆర్టీసీ సమ్మెకు అనుకూల పరిస్థితులు లేవని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి పూర్తిగా సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పోరాటం ఎంతో కీలకంగా నిలిచిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ…
Ponnam Prabhakar: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత పోర్టల్ ‘‘వాహన్ సారథి’’లోకి నేడు ( ఏప్రిల్ 30)న తెలంగాణ రాష్ట్రము చేరింది. సికింద్రాబాద్ లో ఉన్న RTO కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ‘సారధి పోర్టల్’ ప్రారంభోత్సవం చేసారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా సారధి పోర్టల్ ను లాంచ్ చేశారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సేవలను సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.…