రాత్రి 11 గంటల వరకు పోలింగ్ నడిచిందని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోలింగ్ నడుస్తున్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల కమీషన్ ఎలా అనుమతించారు..? అని ప్రశ్నించారు. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత 30 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్ ఎలా సరైందని విమర్శించారు. నూటికి నూరు శాతం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు.. సత్తుపల్లిలో నాల్గోసారి విజయం సాధిస్తున్నట్లు ధీమా…
తెలంగాణలో గురువారం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. పలుచోట్ల ఈవీఎంల మొరాయించాయి.. అవి తమ దృష్టికి రాగానే ఈవీఎంలను మార్చినట్లు పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో పోటీచేసిన అగ్రనేతల ఇలాఖాల్లో పోలింగ్ శాతం ఎలా ఉందంటే.. కేసీఆర్, రేవంత్ బరిలో ఉన్న కామారెడ్డిలో 34.6 శాతం పోలింగ్ నమోదైంది. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో 42.54 శాతం పోలింగ్ నమోదైంది. ఈటల బరిలో ఉన్న హుజురాబాద్ లో 41.40 శాతం ఓటింగ్.. రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్ లో 43.20 శాతం ఓటింగ్ నమోదైంది. భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో 40.67 శాతం ఓటింగ్.. బండి సంజయ్ బరిలో…
High tension at Pinapaka Polling:తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి జరుగుతున్న పోలింగ్ ముగిసింది. అయితే ఐదు గంటల వరకు క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే భద్రాచలం జిల్లా పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో నాలుగు గంటలకే నిబంధనల ప్రకారం పోలింగ్ ని ముగించేశారు అక్కడి అధికారులు. ఇక భద్రాది కొత్తగూడెం…
Polling percentage till 1PM is 36.68: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 1 గంటకు 36.68 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ఓ ప్రకటలో తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా గద్వాల్లో 49.29 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా హైద్రాబాద్ నగరంలో 20.79 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అదిలాబాద్ 41.88% భద్రాద్రి 39.29% హనుమకొండ 35.29% హైద్రాబాద్ 20.79% జగిత్యాల 46.14% జనగాం 44.31% భూపాలపల్లి 49.12% గద్వాల్ 49.29%…
Polling Percentage in Telangana till 11AM: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనుంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్నారు. 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20.64 పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 30.27 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా హైద్రాబాద్ నగరంలో 12.39 శాతం పోలయ్యాయి. అదిలాబాద్…
Telangana Elections 2023 Polling Start From 7AM: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగనున్న మూడో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌కు అవకాశం ఉండగా.. 13 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌కు అవకాశం ఉంది.…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఇక, ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది.. మరోవైపు.. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. బరిలో వున్న అభ్యర్థులు 2,290 మంది. వారిలో మహిళలు 221 మంది కాగా, పురుషులు 2,068 మంది, ఒక ట్రాన్స్ జెండర్. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2 వేల 799. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య కోటి 62 లక్షల 98 వేల 418. మహిళా ఓటర్లు…
Telangana Elections: రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రచారంలో పరిగెత్తుతున్న అభ్యర్థుల మైకులు మూగబోనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని ఓటర్లకు ప్రసన్నం చేసుకునేందుకు బయలు దేరారు.