High tension at Pinapaka Polling:తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి జరుగుతున్న పోలింగ్ ముగిసింది. అయితే ఐదు గంటల వరకు క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే భద్రాచలం జిల్లా పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో నాలుగు గంటలకే నిబంధనల ప్రకారం పోలింగ్ ని ముగించేశారు అక్కడి అధికారులు. ఇక భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లో అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గం లోని ఎల్చిరెడ్డిపల్లి పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే రేగా కాంతారావుని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఒక మహిళను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నెట్టివే యటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Telangana Assembly Election 2023: తెలంగాణలో ముగిసిన పోలింగ్..
అయితే ఈ సమయంలో రేగా కాంతారావు చెప్పు తీయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం రేగా కాంతారావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు కాల రాయవద్దని కోరారు. ఇక మరోపక్క సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీ సర్పంచ్ తండాలో డబ్బులు రాలేదని గ్రామస్తులు ముందు ఎవరూ పోలింగ్ బూత్ కి రాలేదు. అయితే ఓటు వేయకున్నా పోలింగ్ బూత్ వద్ద గ్రామస్తులంతా ఉండటంతో ఒక్కసారిగా ఓటు వేసేందుకు దూరే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు అది ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామస్తులు పై డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ లాఠీచార్జి చేసినట్టు చెబుతున్నారు.