Gujarat Elections: గుజరాత్ రాష్ట్రంలో తొలివిడుత ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. తొలి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.
ప్రభుత్వ యంత్రాంగం, రైస్ మిల్లర్ల మధ్య రైతు నలిగిపోతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన కష్టాన్ని అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దాడులు చేస్తూ ఎదురుదాడులతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని కాంగ్రెస్లో కీలక నేత మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.