ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. ఏపీలో జనసేన పార్టీ పటిష్టానికి నడుం బిగించారు అధినేత పవన్ కళ్యాణ్. మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని క్యాడర్ ను కోరారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీకి కార్యకర్తలే బలం.. వారే పార్టీ సంపద.రెండు విడతలుగా క్రియా శీలక సభ్యత్వ కార్యక్రమం విజయవంతమైంది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ మూడో విడత చేపడుతున్నాం.ఈ నెల 10వ తేదీన మొదలై 28వ తేదీ వరకు మూడో విడత క్రియా శీల సభ్యత్వం సాగుతుంది.
Read Also: KotamReddy Sridhar Reddy: నమ్మకద్రోహం మాటకు బాధేసింది
గత రెండు విడతల్లోనూ పార్టీ క్రియాశీలక సభ్యులను చేర్చడం కోసం ఎంతో కష్టపడి పని చేసిన సుమారు 6,400 మంది పార్టీ వాలంటీర్లకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు.పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, ప్రమాద బీమా నమోదు నిమిత్తం నా వంతుగా రెండు విడతల్లోనూ రూ.2 కోట్లు విరాళం ఇచ్చాను.మూడో విడతలోనూ నా వంతుగా కార్యకర్తల బీమా కోసం ఈ నెల 10వ తేదీన నా వంతు విరాళం అందిస్తున్నాను.మూడో విడతలోనూ బలమైన స్ఫూర్తితో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమష్టిగా ముందుకు తీసుకువెళ్లి, విజయవంతం చేయాలన్నారు.
Read Also: K Vishwanath: కళాతపస్వికి కన్నీటి నీరాజనం.. ప్రధాని సహా ప్రముఖుల సంతాపం