జూలై18న ఎన్డీయే కూటమి కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి పలు పార్టీలకు ఆహ్వానాలు పంపించేందుకు ఎన్డీఏ సిద్ధమయినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఏ కూటమికి చెందని మరికొన్ని పార్టీలను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.
తన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహాకూటమి ప్రభుత్వంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో రాజీనామా చేసినట్లు వివరించారు.
తమిళ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హీరో రజినీకాంత్ తో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఆయన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా డిమాండ్ ఎక్కువే..దాంతో విజయ్ తమిళ్ సినిమాలను తెలుగులో కూడా తీస్తున్నారు.. అయితే హీరో విజయ్ గురించి సినిమా అప్డేట్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే ఆయన త్వరలోనే ఓ ప్రముఖ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా పలు సమావేశాల్లో ఆయన మాట్లాడుతున్నారు. విద్యార్థులతోపాటు ఇతరులతోనూ సమావేశం అవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై జిల్లా స్థాయిలో బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలతో జరిగిన అంతర్మథన సమావేశం తర్వాత బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బొమ్మై ఆరోపించారు. వారిని వ్యతిరేకించే ప్రతి గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తూ వాక్‌స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు.. నేను చెబుతున్నాను.. ప్రజలు త్వరలో ఎమర్జెన్సీ వంటి పరిస్థితిని చూస్తారు’ అని బొమ్మై జోస్యం చెప్పారు.
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ముందు వరుసలో ఉన్నాడు.. ఐపీఎల్‌లో కూడా ధోనీ కెప్టెన్సీతో ఐదు ట్రోఫీలను అందించాడు. చెన్నై టీమ్‌కు నాయకత్వం వహించిన మిస్టర్ కూల్.. నాయకత్వంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్టర్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
బీహార్లో కూడా మటన్ తో భోజనం అనే సరికి భారీగా జనం తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ రాష్ట్రంలో ఓ ఎంపీ కార్మికుల కోసం మటన్ రైస్తో ఏర్పాటు చేసిన విందుకు భారీగా వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది.