Rajinikanth comments on Political entry: రాజకీయాల్లోకి ఎందుకు రాలేదనే విషయం పై క్లారటీ ఇచ్చారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పొలిటికల్ ఎంట్రీకి దాదాపు రెడీ అయ్యాను. అయితే అదేటైంలో కరోనా (Covid) వచ్చిందన్నారు. రాజకీయాల్లో రావాలనే ప్లాన్ లో ఉన్నప్పుడు డాక్టర్లు కీలమైన సూచనలు చేశారు …ప్రజలను కలిసే సమయంలో పది అడుగుల దూరం ఉండాలి,మాస్క్ వేసుకోవాలని అన్నారు. ఆరోగ్య పరిస్థితి రీత్యా పొలిటికల్ ఎంట్రీ పై ఆలోచించి అడుగు వేయాలన్నారు..అప్పటికే కిడ్నీ సమస్య ఉండటం …దానికి తోడు కరోనా వైరస్ తీవ్రమైన ఉన్న జనాల్లోకి వెళ్ళడం మంచిది కాదన్నారు..రాజకీయాల్లో రజనీకాంతరావు రావడానికి భయపడ్డాడు అన్నారు. రాజకియాల్లో రాకపోవడానికి అసలు నిజం నా ఆరోగ్యం సహకరించకపోవడమే అని అసలు సంగతి చెప్పేశారు.
రజనీకాంత్ రాజకీయాలకు ఎందుకు దూరమయ్యారనేది ఇప్పటికీ చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. తాజాగా రజనీకాంత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఆయన అభిమానులకు ఊరట నిస్తాయేమో చూడాలి. తనకు మూత్రపిండాల సమస్య ఉండటం వల్లే రాజకీయాలకు దూరమయ్యానని రజనీకాంత్ చెప్పడంతో ఆయనపై విమర్శలు చేసేవారికి సమాధానం చెప్పినట్టు అయిందంటున్నారు విమర్శకులు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి ఆయన అతిథిగా పాల్గొన్నారు. రాజకీయాలంటే తనకు భయమనీ అంతా అనుకుంటారని, అందుకే ఎక్కడా చెప్పలేదని వివరించారు.
Honoured to be at the Silver Jubilee celebrations of Sapiens Health Foundation, along with my friend, superstar Rajinikanth. Pleased to launch the Foundation’s initiative, “Decrease salt, Increase life.” pic.twitter.com/XuxY44yeRH
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 11, 2023
శరీరంలోని వ్యవస్థను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుందని, రక్తాన్ని మానవులెవరూ తయారు చేయలేరని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. దేవుడున్నాడు అనేందుకు ఇదే నిదర్శనమని తెలిపారు. దేవుడు లేడు అనేవారు కనీసం ఒక బొట్టు రక్తాన్నైనా తయారుచేసి చూపించాలని రజనీకాంత్ సవాల్ చేశారు. ఇదిలా ఉంటే వెంకయ్కనాయుడికి ఉప రాష్ట్రపతి ఇవ్వడం తనకు నచ్చలేదని కామెంట్ చేశారు రజనీకాంత్. అయితే రజనీకాంత్ ని తాను రాజకీయాల్లోకి రావొద్దని హితవు పలికానన్నారు వెంకయ్యనాయుడు. ఆ సమయంలో తనను ఆయన అపార్థం చేసుకున్నారని తెలిపారు.
Read Also:ED: లాలూ అక్రమ సంపాదన రూ.600 కోట్లు.. రూ.150 కోట్ల భవనాన్ని 4 లక్షలకే కొనుగోలు..