Sharad Pawar Takes Back His Resignation As NCP Chief: మూడు రోజుల క్రితం తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శరద్ పవార్.. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజీనామాను ఉపసంహరించుకున్నారు. తన కార్యకర్తల భావాలను అగౌరవపరచలేనన్న ఆయన.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడిగా కొనసాగుతానని తెలిపారు. ‘‘అన్నింటిపై పునరాలోచన చేసిన తర్వాత నేను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాను. నా మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా’’ అని చెప్పారు. తన పార్టీ కార్యకర్తల ప్రేమ, అభిమానం, నమ్మకం తనను కదిలించాయని.. వాళ్ల ఇష్టం మేరకే తన రాజీనామాను వెనక్కు తీసుకుంటున్నానని తెలిపారు. వాళ్ల అభీష్టం మేరకే నడుచుకుంటానని చెప్పిన ఆయన.. వాళ్ల సెంటిమెంట్‌ని కాదనలేనని, ఎన్నో ఏళ్లుగా వాళ్లు తనతోనే ఉంటున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. శుక్రవారం సాయంత్రం శరద్ పవార్ తన రాజీనామాని వెనక్కి తీసుకోవడంతో.. పార్టీ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.
RR vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్ రాయల్స్
కాగా.. మంగళవారం తన ఆత్మకథ రెండో భాగం పుస్తకం విడుదల చేస్తూ, శరద్ పవార్ తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. ఆ ప్రకటనతో ఖంగుతిన్న ఎన్సీపీ కార్యకర్తలు, నాయకులు.. తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రాజీనామాని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. భారీస్థాయిలో నిరసనలు చేశారు. ఎన్సీపీ కమిటీ సైతం ఆయన రాజీనామా నిర్ణయాన్ని తిరస్కరించింది. ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగాలని ప్యానెల్ కోరింది. శుక్రవారం ఉదయం ఎన్సీపీ అగ్ర నాయకులు కూడా శరద్ పవార్‌ని తిరస్కరిస్తూ.. లక్షలాది మంది కార్మికుల భావాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన్ను కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నప్పటికీ, సంస్థలో ఏదైనా పదవి లేదా బాధ్యతల కోసం వారసత్వ ప్రణాళిక ఉండాలనే స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నానన్నారు. భవిష్యత్తులో పార్టీలో సంస్థాగత మార్పులు చేయడంపై దృష్టి పెడతానన్నారు. కొత్త బాధ్యతలతో పాటు కొత్త నాయకత్వాన్ని సృష్టిస్తానన్నారు.
Mallikarjuna Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే.. నాదే పూర్తి నైతిక బాధ్యత
మే 2వ తేదీన తన ఆత్మకథ పుస్తకం ‘లోక్ మేజ్ సంగతి’ విడుదల సందర్భంగా తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించానని.. 63 ఏళ్లపాటు ప్రజా జీవితంలో సుదీర్ఘ సేవలందించిన తర్వాత తాను అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని శరద్ పవార్ తెలిపారు. కానీ.. తన నిర్ణయం ప్రజల్లో బలమైన మనోభావాలను రేకెత్తించిందని.. పార్టీ కార్యకర్తలు, సహచరులు తన నిర్ణయం పట్ల నిరుత్సాహం వ్యక్తం చేశారని.. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించమని తనని విజ్ఞప్తి చేశారని అన్నారు. దేశం నలుమూలల నుండి వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా తనని ఒప్పించారన్నారు. తనపై కురిపించిన ప్రేమ, విశ్వాసంతో తాను పొంగిపోయానని.. ఆ విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకుని, కమిటీ నిర్ణయాన్ని గౌరవిస్తూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు.