మాటల తూటాలు పేలుతున్నాయి. డైలాగ్‌లు ఆటంబాంబుల్లా రీసౌండ్‌నిస్తున్నాయి. ఎన్నికల్లో హీట్ పెంచడానికి కొందరు నేతలు వాడుతున్న అభ్యంతకర భాష శ్రుతిమించుతోందా?.. జూబ్లీహిల్స్ ఎన్నికలో మూడు పార్టీల పెద్ద నాయకుల లాంగ్వేజ్ హద్దు దాటుతోందా? జూబ్లీహిల్స్ పోలింగ్ దగ్గరపడేకొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. గల్లీగల్లీ చుట్టేస్తూ..రోడ్ షోలు నిర్వహిస్తూ లీడర్లు డైలాగ్ డోస్ పెంచుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా…లాంగ్వేజ్‌ని మరో లెవెల్ కి తీసుకెళ్లడమే క్యాంపెయిన్ తీరును మార్చేస్తోంది. ఒకరిని మించి ఒకరు మాటల స్థాయిని దిగజారేస్తున్నారు. ఒకప్పుడు…
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక పదవికి మళ్లీ ఎర్త్ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోకల్‌గా బుట్టా, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వర్గాల మధ్య గొడవలు పీక్స్‌కి చేరాయట.
హరీష్ మాటలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్‌కు చులకనభావం.. చట్టసభలు, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారధ్యంలో నియమించిన జ్యుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదన్నారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకటో తారీకు వస్తే పండగ వాతావరణం నెలకొంటుందని.. వైసీపీ పాలనలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేందుకు ఐదేళ్లు పట్టిందన్నారు. జగన్ పింఛన్లు పెంచుతామని ప్రజలను మోసం దగా చేశారని.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్న పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నామని తెలిపారు. ఏడాది పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి…
Ambati Rambabu Slams TDP:164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు జగన్ నామ జపం చేస్తున్నారని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.. తాజాగా అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీల ప్రక్రియ సంగతి మర్చిపోయి జగన్ కట్టడి కోసం పనిచేస్తున్నారని.. చిట్టి నాయుడు దెబ్బకు చంద్రబాబు బుర్ర కూడా పోయిందన్నారు.. జగన్ ను ఆపటం మీ తరం కాదు.. జగన్ వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం…
ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనిఫామ్ దగ్గర నుంచి చిక్కీ వరకూ పార్టీ రంగులు, మీ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువలు మాట్లాడటం మీకే చెల్లిందని..ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఇచ్చే టెక్స్ట్ బుక్స్ రద్దు చేసిన మీరూ మాట్లాడటమేనా?…
Srinivasa Varma: ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. తణుకు మున్సిపాలిటీలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అంటూ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొడతారని భావించి దూకుడుగా ప్రవర్తించడమంటూ.. నరికేస్తాం, చంపేస్తాం.. అని మాట్లాడితే ఆ నాలుకనే కోస్తామని హెచ్చరించారు. టిడిఆర్ బాండ్ల విషయమై కారుమూరి…