P Chidambaram: పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్ చర్చకు అంతా అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే, దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పహల్గామ్ ఉగ్రదాడిలో ‘‘స్వదేశీ ఉగ్రవాదులు’’ పాల్గొనవచ్చని ఆయన అన్నారు. హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఏక్కడ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
రాహుల్‌గాంధీపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని.. పాకిస్థాన్ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోందని మండిపడ్డారు.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని పునరుద్ఘాటించారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. నక్సలైట్లపై అంశంపై అమిత్‌షా మరోసారి స్పందించారు.