Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం అతిపెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై నమ్మకం లేదనడం రచ్చకు దారి తీసింది. అయితే దీనికి తోడు పాత వీడియోల్లో ఆయన నాస్తికుడు అని చెప్పిన విషయాలను కూడా బయటకు తీస్తున్నారు. ఇంకేముంది మంటల్లో పెట్రోల్ పోసినట్టు రాజమౌళి వివాదం పీక్స్ కు వెళ్లిపోయింది. హిందూ సంఘాలు వరుసగా కేసులు పెడుతున్నాయి. బీజేపీ నేతలు వీడియోలు రిలీజ్ చేస్తూ విమర్శిస్తున్నారు. రాజమౌళి…
ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడానికి ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలరు రాజకీయ నాయకులు. కానీ...ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు టీడీపీ నేతలు మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నారని సొంత కేడరే మాట్లాడుకుంటోంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 స్థానాలకుగాను 12 చోట్ల గెలిచినా... జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడం, గుర్తింపు ఉన్న ఏ ఇతర పదవులు రాకపోవడంతో...డీలా పడ్డారట జిల్లా టీడీపీ లీడర్స్.
Asaduddin Owaisi: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరగనున్న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై రాజకీయ, సామాజిక వివాదం ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ప్రతిపక్షాలు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏఐఎంఐఎం చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓ మీడియా సంస్థతో ఒవైసీ మాట్లాడుతూ..
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.