CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియ ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ప్రధానిపై ఒత్తిడి పెరగనుందని, అన్ని రాష్ట్రాల్లో కూడా కుల గణన చేయాలని డిమాండ్ రాబోతోందని తెలిపారు. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. భవిష్యత్లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే డాక్యుమెంట్ దేశానికి…
Telangana MLAs: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తమ పార్టీ మార్పుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి నోటీసుల్లో పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. అయితే, ఈ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కావాలని కోరుతున్నారు. అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఈ…
Congress MLC Candidate: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వి.నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో పాటు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి. ఇదివరకు బీఆర్ఎస్కు ఈ ప్రాంతం…
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్కు ప్రేమ్ సాగర్ రావు ప్రధాన స్థంభమని ప్రశంసించారు. ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే, పంచాయతీ ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు. కేబినెట్ విస్తరణపై మాట్లాడుతూ, ఇది గోప్యమైన అంశమని, ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేమని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు…
MLC Kavitha : నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది ? చేతిలో ఎర్రబుక్కు పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదు ? అని ఆమె…
Manda Jagannatham : మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మందా జగన్నాథం (73) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1996లో తెలుగు దేశం పార్టీలో చేరిన ఆయన, మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం వరుసగా 1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించి…
టీడీపీలో ఆళ్ల నాని చేరిక మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. టీడీపీలోకి ఆళ్ల నానిని తీసుకునేందుకు పార్టీ పెద్దలు నిన్న ముహూర్తం ఫిక్స్ చేయగా.. పార్టీ అధినేత సమయం ఇవ్వక పోవడంతో ఆళ్ల నాని చేరిక వాయిదా పడింది. ఆళ్ల నాని చేరికపై టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Bandi Sanjay : నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ కరీంనగర్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. నాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలే అని ఆయన వ్యాఖ్యానించారు. Kakinada: కుడా ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి.. కుప్పకూలిన స్టేజ్…
రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందని ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడిందని, అనర్హత పైన సర్వాధికారులు స్పీకర్ కు ఉన్నాయని కోర్టు తేల్చిందన్నారు ఆది శ్రీనివాస్.