ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, నవ్యాంధ్రలుగా ఏర్పడ్డాక రాజకీయంలో స్పష్టమైన మార్పు వచ్చేసింది. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించగా.. ఏపీ మాత్రం లోటుబడ్జెట్ రాష్ట్రంగా మిగిలిపోయింది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పినా.. అది నీటిమీద రాతలుగా మిగిలిపోయింది. హైదరాబాద్ ను తానే నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో కనీసం ఏపీకి రాజధానిని కూడా నిర్మించకపోవడం శోచనీయంగా మారింది. తన పాలనలో సంక్షేమాన్ని పెద్దగా…