సమావేశానికి గైర్హాజరై 15మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉoడటo సరికాదని ముగింపు సందేశంలో గట్టిగా క్లాస్ పీకారు. ఆహ్వానితుల్లో 56మంది గైర్హాజరయ్యారంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంత మంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారు,
జనసేన నుంచి తాజాగా ఓ లేఖ విడుదలైంది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్‌లో లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది పార్టీ. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పార్టీ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి.. తన చర్యలతో పార్టీనే ఇరకాటంలోకి నెడుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొలికపూడికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో రేపు మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది.
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన పరిధిని దాటిన ప్రవర్తనతో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేసీఆర్ కౌశిక్‌రెడ్డిని అదుపులో ఉంచాలని సూచించారు. కొంపల్లి దేవరయాంజాల్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం తగదని స్పష్టంచేశారు. దాడులు, దురుసుగా ప్రవర్తించడం తెలంగాణ సంస్కృతి కాదని,…