Drugs: తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ తో పట్టుబడిన కేసులో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి భూపాలపట్నం దగ్గర గెస్ట్ హౌస్ లో జరిగిన బర్త్ డే పార్టీకి తాడేపల్లిగూడెంకు చెందిన యువకులు డ్రగ్స్ తీసుకుని వచ్చారు.
కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీ ట్రాప్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.. తవ్వే కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి.. హనీ ట్రాప్ కేసు గుట్టు రట్టు అవ్వడంతో ఒక్కొక్కరిగా బాధితులు పోలీస్ స్టేషన్కు క్యూలు కడుతున్నారు.. తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది.. పోలీసులకే జలక్ ఇచ్చింది మాయ లేడీ జాయ్ జేమియా..
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది.. భూపాలపట్నంలోని పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారులో డ్రగ్స్ ప్యాకెట్లు బయటపడ్డాయి. కారులో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
తెనాలిలో జరిగిన, ఓ హత్య కేసు సంచలనం కలిగించింది.. ఎందుకంటే హత్యకు గురైన వ్యక్తి, గతంలో సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పని చేసాడు.. అలాంటి బౌన్సర్ను హత్య చేశారంటే ఏం జరిగిందో అన్న ఆసక్తి ప్రజల్లో ఉంటే, పోలీసులకు మాత్రం టెన్షన్ పట్టుకుంది.. ఈ హత్య కేసు ఏమయింటుందో , ఎంతమంది హత్య చేసి ఉంటారో, మరి ఎంతమంది ప్లాన్ చేసి ఉంటారు,అని పోలీసులు అలర్ట్ అయిపోయారు... తీరా హత్య కేసు ను ఆరా తీసిన…
మేం ఆడుతాం అని వీళ్లు! మిమ్మల్ని ఆడనివ్వం వాళ్లు! పర్మిషన్ ఉందని వీళ్లు! అయినా సరే ఆటలు సాగనివ్వం అని వాళ్లు! అధికారపార్టీనే అడ్డుకుంటారా అని వాళ్లు! ఎవరైతే నాకేంటి అని వీళ్లు! ఇదీ అక్కడి క్లబ్బుల్లో జరుగుతున్న వార్! ఇంకా క్లారిటీ కావాలంటే.. ఛలో కొవ్వూరు!
విశాఖలో ఓ కిలాడీ లేడీ వ్యవహారం వెలుగుచూసింది.. విదేశాల్లో స్థిరపడ్డ, బాగా సంపాదించిన మగవాళ్లే ఆమె టార్గెట్ కాగా.. సోషల్ మీడియా ద్వారా ఎన్నారైలకు వల విసరడం, అందమైన ఫోటోలు షేర్ చేసి ఆకర్షించడం, ప్రేమ పెళ్లి పేరుతో లైన్లో పెట్టడం.. అవసరం అయితే.. వీడియో కాల్స్ కూడా చేయడం.. ఆమె దినచర్య. అయితే, ఆమె మొహంలో పడితే అంతే.. వాళ్ల దగ్గర నుంచి దొరికినంత దోచుకుని.. నిండా ముంచేయడంలో ఆమె దిట్ట..
Raebareli: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పట్టాలు తప్పించేందుకు కుట్రలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాయ్బరేలీ జిల్లాలో జరిగింది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే నిలిపివేశాడు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియా సమావేశం నిర్వహించారు చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అని అన్నారు. పాప తండ్రి ఓ మహిళకు మూడున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు.. అప్పుడు తిరిగి చెల్లించాలంటూ ఆ మహిళను బెదిరించడం, తిట్టడం సివిల్ కోర్టులో కేసు వేస్తామని చెప్పాడు. దీంతో.. అతనిపై పగ పెంచుకుని ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా చిన్నారిని…
Hyderabad: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ దీప్తి శ్రీనగర్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్పందన మాజీ ప్రియుడే హత్య చేసినట్లు తెలింది. మియాపూర్ సీబీఆర్ ఎస్టేట్లో స్పందన హత్యకు గురైన తర్వాత సీసీటీ పుటేజ్ ఆధారంగా మర్డర్ చేసింది మందల మనోజ్ కుమార్ (బాలు) గుర్తించారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ)లో విఫలం కావడంతో ఒక యువతి నకిలీ ఐఏఎస్ అవతారమెత్తింది. స్పూఫ్ కాల్స్ ద్వారా అధికారులను బెదిరించి లగ్జరీ అనుభవించాలని ఎత్తుగడ వేసింది. కానీ పాపం పండి కటకటాల పాలైంది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.