Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లింగాల పోలీస్ స్టేషన్‌లో యువకులు గుండు కొట్టించడం కలకలం రేపుతోంది. ఓ కేసుకు సంబంధించి ముగ్గురు యువకులను గుండు కొట్టించుకున్న ఎస్‌ఎస్‌ఐ పోలీసు స్టేషన్‌కు పిలిపించాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంకు వద్ద యువకులకు, సిబ్బందికి మధ్య పెట్రోల్ విషయంలో గొడవ జరిగిందని విశ్వసనీయ సమాచారం. పెట్రోలు బంకు నిర్వాహకుల ఫిర్యాదు మేరకు యువకులను పీఎస్‌కు తరలించారు. ముగ్గురు యువకుల్లో ఒకరు ఎస్సై ని ప్రశ్నించారు. దీంతో ఎస్సీ జగన్ ముగ్గురు యువకులకు గుండు చేయించాడు. మరుసటి రోజు ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
Sarfaraz-Pant: భాయ్ వెనక్కి వెళ్లిపో.. చిన్నపిల్లాడిలా గంతులేసిన సర్ఫరాజ్! నవ్వుకుండా ఉండలేరు