Cyber Fraud: సైబర్ మాయాజాలం.. ఉద్యోగం పేరుతో రూ.1 లక్ష 75 వేలు స్వాహా..
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎన్ఎం ఉద్యోగం పేరిట రూ.లక్షలు స్వాహా...
- పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: సైబర్ నేరగాళ్ళ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకులు నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. ఉద్యోగం పేరుతో రూ.1లక్షా 75 వేలు స్వాహా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం పోలారంకు చెందిన ఓ యువతి నిరుద్యోగి, అయితే ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంది. దీనిని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు ఆమె ఫోన్ కు మెసేజ్ పంపించారు. నిరుద్యోగిగా వున్న యువతి ఉద్యోగం వస్తుందని ఆశ పడింది. వెనకాముందు ఆలోచించకుండా మెసేజ్ కు రిప్లై వచ్చింది. దీనిని సైబర్ కేటుగాళ్లు ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పిస్తానంటే నిజమని నమ్మిన యువతి పలు దఫాలుగా డబ్బులు పంపించింది. అది కాస్తా రూ. 1 లక్షా 75 వేల రూపాయలు ట్రాన్సఫర్ చేసుకున్నాడు. ఇక ఆ యువతికి ఉద్యోగంలో చేరడమే ఆలస్యం అనుకుంది. ఇంతలోనే సైబర్ కేటుగాడు ఆ యువతికి గట్టి షాక్ ఇచ్చాడు. ఫోన్ స్విచ్ ఆఫ్, నో రెస్పాన్స్ దీంతో మోసపోయానని గుర్తించిన బాధితురాు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం పేరుతో తన దగ్గర రూ.1 లక్షా 75 వేల రూపాయలు మోసపోయానని వాపోయింది. ఉద్యోగము రాక, ఇటు డబ్బులు పోయి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏఎన్ఎం ఉద్యోగం అంటే ఆశ పడ్డానని తెలిపింది. తన డబ్బులు వాపసు ఇప్పించాలని కోరింది. తనకు వచ్చిన నెంబర్, డబ్బులు ట్రాన్ ఫర్ చేసిన ఫోన్ నంబర్ లను పోలీసులకు ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ కు రెన్పాన్స్ కావద్దని, యువతను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారని.. అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Sabarimala: శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల ఉచిత బీమా
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!