ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి పోలీసులు షాకిచ్చారు. అమలాపురం అల్లర్లు నేపధ్యంలో ఆలమూరు వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అడ్డుకున్నారు పోలీసులు. అమలాపురం వెళ్తున్నారని సోము వీర్రాజును అడ్డుకున్నారు పోలీసులు. రావులపాలెం పోలీసు స్టేషన్ వద్దకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు – బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సోమువీర్రాజు వాహనం కదలనీయకుండా రోడ్డుకు అడ్డంగా మరో వాహనం అడ్డం పెట్టారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు,…