Somu Veerraju: సోము వీర్రాజుకి పోలీసుల షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి పోలీసులు షాకిచ్చారు. అమలాపురం అల్లర్లు నేపధ్యంలో ఆలమూరు వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అడ్డుకున్నారు పోలీసులు. అమలాపురం వెళ్తున్నారని సోము వీర్రాజును అడ్డుకున్నారు పోలీసులు. రావులపాలెం పోలీసు స్టేషన్ వద్దకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు – బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
సోమువీర్రాజు వాహనం కదలనీయకుండా రోడ్డుకు అడ్డంగా మరో వాహనం అడ్డం పెట్టారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వాహనం ఎందుకు ఆపుతున్నారని అడిగితే కారణం చెప్పలేక పోతున్నారు పోలీసులు. ఎస్పీ ఆదేశాలతో ఆపామంటున్నారు పోలీసులు.
Also Read
అమలాపురం అల్లర్లలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు తాను వెళుతున్నానని, తనను అడ్డుకోవడమేమిటని వీర్రాజు ప్రశ్నించారు. అల్లర్ల నేపథ్యంలో ఇంకా పోలీసు ఆంక్షలు కొనసాగుతున్న అమలాపురంలో ప్రముఖుల పర్యటనకు అనుమతించలేమని పోలీసులు ఆయనకు తేల్చిచెప్పారు.
కనీసం తమ పార్టీ నేతలనైనా కలిసేందుకు అనుమతిస్తారా? అని వీర్రాజు అడగగా… బయటి వ్యక్తులను అమలాపురంలోకి అనుమతించబోమంటూ పోలీసులు తెగేసి చెప్పడంతో సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రావులపాలెంలోని తమ పార్టీ నేత తల్లి ఇటీవలే మరణించారని, కనీసం ఆ నేత కుటుంబం పరామర్శకు అయినా అనుమతిస్తారా? అని వీర్రాజు అడగగా… రావులపాలెం వరకు అయితే అనుమతిస్తామని పోలీసులు స్సష్టం చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. సోము వీర్రాజు కారు రావులపాలెం వైపు వెళ్ళిపోయింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!