Golden Jubilee: డైలాగ్ కింగ్, అజాత శత్రువు సాయికుమార్ కు యాభై యేళ్ళు! అదేమిటీ ఆయన పుట్టింది 1960లో కదా అని కొందరికి అనుమానం రావచ్చు. బట్.... నటుడిగా ఆయనకు ఇది 50వ సంవత్సరం. పన్నెండేళ్ళ చిరు ప్రాయంలో తొలిసారి మయసభలోని దుర్యోధనుడి పాత్ర కోసం ముఖానికి రంగు వేసుకున్నారు సాయికుమార్. ఆ తర్వాత బాలనటుడిగా, యువ నటుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాభై సంవత్సరాల పాటు వివిధ భాషల్లో వందలాది చిత్రాలలో నటించారు.
(డిసెంబర్ 19తో పోలీస్ స్టోరీకి 25 ఏళ్ళు)అప్పటి దాకా తనదైన గాత్రంతో ఎంతోమందిని స్టార్స్ గా నిలిపిన ప్రముఖ నటుడు సాయికుమార్ ను స్టార్ గా మలచిన చిత్రం పోలీస్ స్టోరీ. తెలుగువారయిన సాయికుమార్ కు నటనంటే ప్రాణం. అయితే ఆయనకు తగ్గ పాత్రలు తెలుగులో అంతగా లభించలేదు. దాంతో తమిళ, కన్నడ చిత్రాల్లోనూ అందివచ్చిన పాత్రల్లో నటించేవారు. సాయికుమార్ యాక్టింగ్ లో మహానటుడు శివాజీగణేశన్ కనిపిస్తారని, అప్పట్లో కన్నడిగులు అనేవారు. దానిని ఆధారం చేసుకొని ప్రముఖ…