రంగారెడ్డి జిల్లా ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం కలకలం సృష్టిస్తోంది. రాకేష్ అనే యవకుడు తనతో తెచ్చుకున్న కత్తితో రెండు చేతుల మణికట్టు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన పోలీసులు రాకేష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్ పాండు రంగ నగర్ కు చెందిన ఓ వివాహిత తో గత కొంత కాలంగా రాకేష్ అక్ర సంబంధం కొనిసాగిస్తున్నాడు. భర్త తో దూరంగా ఉంటూ రాకేష్…
విద్యాబుద్దులు చెప్పించే మాస్టారే తప్పటడుగు వేస్తే.. విద్యార్థులకు మంచి చదువు చెప్పి మంచి నడవడికను నేప్పించే ఉపాధ్యాయుడే కామవాంఛకు లోనైతే.. విద్యార్థులకు కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఆ గురువే ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ మైనర్ బాలికలను వేధించడం మొదలు పెట్టాడు. చిన్న పిల్లలకు తండ్రిగా తోడై వుండి.. విద్యాభ్యాసం నేప్పించాల్సింది పోయి. అభం శుభం తెలియని ఆ మైనర్ బాలికపై కన్నువేశాడు ఆ.. కామాంధుడు. కొద్దిరోజులు నరక యాతన అనుభవించిన ఆ చిన్నారులు…
https://youtu.be/OhCCLSb_rV8 అవును.. శ్రీలంకలో అదే జరుగుతోంది. ఆనాడు రామాయణంలో హనుమంతుడు లంకను తగులబెట్టాడని అంటారు. చూసి రమ్మంటే కాల్చివచ్చాడంటారు. కానీ ఇప్పుడు లంకలో ఆ దేశ ప్రజలే హింసకు పాల్పడుతున్నారు. అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు.. ఎవరి ఇళ్ళను వదిలిపెట్టడం లేదు. ఎంపీలు, మాజీ మంత్రుల ఇళ్లకు ఆందోళనకారులు సాయంత్రం నిప్పు పెట్టారు. సోమవారం నాడు మధ్యాహ్నం ప్రధాని రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత కూడా ఆందోళనలు సద్దుమణగలేదు. కొలంబోలో శాంతియుతంగా…
ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య పొలిటికల్ రంగు పులుముకుంది. నిన్న సాయిగణేష్ అనే వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అయితే ట్రిట్మెంట్ తీసుకుంటూ ఇవాళ చనిపోయాడు. అతడి మృతివకి టీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సాయిగణేష్ బీజేపీ మజ్దూర్ సంఘం జిల్లా అధ్యక్షుడు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని… దాంతో తీవ్ర మనస్థాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. Read Also: Dharmana: మంత్రి ధర్మాన…
డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేశారనే ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బుద్ధా వెంకన్న బెయిల్‌పై విడుదలయ్యారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన్ను పోలీసులు విడుదల చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు సెక్షన్ 153ఎ, భయోత్సాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505 (2),…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఖుషీ బార్&రెస్టారెంట్ ముందు మందుబాబులు వీరంగం చేశారు. అది కూడా రాత్రిపూట కాదు. మిట్ట మధ్యాహ్నం ఆ బార్&రెస్టారెంట్ లో మద్యం సేవించి నానా బీభత్సం చేశారు. బాగా తాగిన మత్తులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.మద్యం సేవించి అనంతరం మాట మాట పెరగడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడి బార్ ముందు గొడవ సృష్టించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బీర్ సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో…
సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. పంజాగుట్ట పాప హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. చిన్నారి మృతదేహాన్ని ఓ ఆటోలో నిందితులు తీసుకొచ్చినట్లు పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. నిందితులు బెంగళూరులో పాపని చంపి హైదరాబాద్ తీసుకొచ్చినట్లు గా గుర్తించారు. పాప హత్య కేసు…
పోలీసులు ఏదైనా సమస్యపై కేసులు నమోదు చేయకుంటే ఎవరిని అడగాలో తెలియదు సామాన్యులకు, కొంచెం డబ్బు, అధికారం పలు కుబడి ఉన్నవారు తమపై దాడులకు దిగిన ఇతర నేరారోపణలు ఉన్న తమపై పోలీసులు కేసు తీసుకోకుంటే ఏం చేయాలో సామాన్యు లకు పాలుపోదు. పోలీసులు ఏదైనా నేరానికి సంబంధించి సమా చారం తెలిస్తే FIR నమోదు చేస్తారు. FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. ఎఫ్‌ఐఆర్‌లో తేది, ఫిర్యాదు ఇచ్చిన వారిపేరు, సమయం, సెక్షన్లు, నేరం, ఫిర్యాదు ఎవరి…
నాలుగు రోజులుగా కోడిపుంజులు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాయి. వాటికి బియ్యం అందిస్తూ పోలీసులు జాగ్రత్తగా చూస్తున్నారు. వాటి రంగుల ఆధారంగా మూడు పుంజులను త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలోని దంతలబోరు శివారులోని అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కోడిపందేలకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందేలు నిర్వహిస్తున్న వారిని, మూడు కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయితే,…