అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేయడంతో అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. ఒకపక్క రాయచోటి పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాలలో పోలీసులు గస్తీ కాస్తుండగా, మరోపక్క టెర్రరిస్టుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
అతీక్ అహ్మద్ సోదరుల హత్య తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నివాసానికి భద్రతను భారీగా పెంచారు. ఈ హత్య జరిగిన తర్వాత కనీసం 17 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొడంగల్ లో పదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసారు దుండగులు. ఎస్సీహాస్టల్ ముందు ముళ్ల పొదల్లో సూట్ కేస్ లో వేసి మృతదేహాన్ని దుండగులు పడేసారు. రాజా ఖాన్ కు 10 సంవత్సరాలు కాగా.. కిడ్నాప్, హత్య కేసులో పోలీస్ లు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.