చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన మురళి అనే టీడీపీ కార్యకర్త ను కిడ్నాప్ చేసి తీవ్రంగా చితకబాది వదిలేశారు వైసీపీ నేత, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ అనుచరులు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్ కి అని చెప్పి మురళి ని తీసుకెళ్ళారు సెంథిల్ కుమార్ అనుచరులు. ప్రస్తుతం కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు మురళి.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ములకల పల్లె గ్రామానికి చెందిన మురళి. కుప్పం బైపాస్ రోడ్డు వద్ద సోమవారం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ అనుచరులు ఇద్దరు పోలీసులు పిలుస్తున్నారు అని చెప్పి ఆయన ఇంటికి తీసుకెళ్లడం జరిగిందని మురళి చెప్పారు. అక్కడకు తీసుకెళ్లిన వెంటనే చైర్మన్ సెంథిల్ అనుచరులు ఒక్కసారిగా తన పై దాడి చేశారన్నారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారి అనుచరులు తీవ్రంగా తనపై దాడి చేసి చంపేస్తామని బెదిరించారని మురళి చెప్పారు. ఈ దాడి విషయం ఎక్కడైనా చెబితే క్వారీకి తీసుకెళ్ళి బ్లాస్ట్ చేసి చంపేస్తామని బెదిరించారన్నారు. భయంతో ఇన్ని రోజులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదని, తనతో పాటు తన కుటుంబానికి రెస్కో చైర్మన్ సెంథిల్ నుంచి ప్రాణహాని ఉందన్నారు. అందువల్లే తాను పోలీసులకు ఫిర్యాదు చేశామని తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నాడు బాధితుడు మురళి. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.