ఇవ్వాల్సిందే…. నాకు పదవి ఇవ్వాల్సిందే…. ఏం ఎందుకివ్వరు? ఉన్నోళ్ళు, జంప్ అయినోళ్ళు… అలా ఎవరెవరికో ఇచ్చేస్తున్నారు…. పార్టీని అంటిపెట్టుకుని వేలాడుతున్న నాకు ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేరా? ఇదీ… ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి వరస. ఇంతకీ ఎవరా నాయకుడు? అంత గట్టిగా డిమాండ్ చేయడం వెనకున్న రీజన్స్ ఏంటి? పొదెం వీరయ్య… భద్రాచలం మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉన్నారు. కానీ… ఆ సీట్లో అంత సంతృప్తిగా లేరట. అందుకే… నాకా…
ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణ చూస్తోంది కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి తుమ్మల నాగేశ్వరరావు దర్శించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించిన తుమ్మల నాగేశ్వరావు భద్రాద్రి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పోదేం వీరయ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ సభలో ఆయన మాట్లాడుతూ.. కోట్లు సంచలతో కొనాలని చూసినా…