ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణ చూస్తోంది కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి తుమ్మల నాగేశ్వరరావు దర్శించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించిన తుమ్మల నాగేశ్వరావు భద్రాద్రి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పోదేం వీరయ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ సభలో ఆయన మాట్లాడుతూ.. కోట్లు సంచలతో కొనాలని చూసినా నిజాయితీగా ఉన్న నేత పోదేం వీరయ్య, అలాంటి నిజాయితీ నేతను గెలిపించాలని తుమ్మల కోరారు.
బ్రిటిష్ కాలంలో కాటన్ దొర కట్టిన దుమ్ముగూడెం ఆనకట్ట బాంబ్‌లు పెట్టినా పేలదన్నారు. కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పరిస్థితి చూడాలన్నారు. భద్రాద్రి శ్రీ రాముడు ఆశీస్సులతో పూజ్యులు ఎన్టీఆర్ రాజకీయ అవకాశం ఇచ్చారని తుమ్మల పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సాక్షాత్తు శ్రీ రాముడు కొలువైన ఆలయం అభివృద్ధి పనులు వాగ్దానం అమలు కాలేదన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రగళ్ల పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మాణం చేస్తామని, పర్ణశాల పర్ణశాల అభివృద్ధి చేస్తామని తుమ్మల వ్యాఖ్యానించారు.