పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇక్కడి గల్లీల నుంచి ఢిల్లీకి చేరాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని…
కరోనా మరోసారి పంజా విసురుతోంది.. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కూడా కరోనా వైరస్ పలకరించింది.. తాజాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. స్వల్ప లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది.. అయితే, ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఏజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి..…
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రెగ్యులర్ టెస్ట్‌లతో పాటు చేసిన టెస్టుల్లో కోవిడ్ సోకినట్లు తెలిసింది. ఈ క్రమంలో కోవిడ్ సోకినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని పోచారం వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా గత కొన్ని రోజుల తనతో సన్నిహితంగా మెదిలిన వ్యక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇటీవల పోచారం శ్రీనివాస్ మనవరాలి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలుగు…
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇవాళ చేసిన కరోనా పరీక్షల్లో… పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా సోకింది. కరోనా మహమ్మారి సోకడంతో… ఆస్పత్రిలో చేరారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో తనకు పాజిటివ్ నమోదు అయిందని… ప్రస్తుతం తనకు ఎటువంటి ఆరోగ్య…
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన రెడ్డి ఆత్మీయ సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసిఆర్ రెడ్డి కమ్యూనిటీ హాల్ కు కోటి రూపాయలు కేటాయించారు. సీఎం కేసీఆర్ అన్ని సామాజీక వర్గాలకు న్యాయం చేస్తున్నారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకునే వర్గం రెడ్డి సామాజిక వర్గం. అన్ని సామాజిక వర్గాలకు ఆత్మీయతను పంచుతున్న వర్గం రెడ్డి వర్గం. రెడ్డి సామాజిక వర్గంలో పుట్టిన ప్రతి బిడ్డ వ్యవసాయం…
కామారెడ్డి జిల్లా.. బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో మాట్లాడుతూ తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. దేశం లో ఎక్కడ లేని అభివృద్ధి తెలంగాణలోనే ఉంది. కానీ ఆ అభివృద్ధి చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి వేరే రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అని అడిగారు. అలా నిరూపిస్తే ఉంటే రాజీనామా చేస్తా అన్నారు. మేము ప్రజలనే నమ్ముకున్నాం , ఓడించాలన్నా గెలిపించాలన్నా ప్రజలతోనే సాధ్యం అవుతుంది. గెలుపు ఓటముల గురించి…