PM MODI: దీపావళికి దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి.. నమో యాప్‌లో సెల్ఫీలు పెట్టాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM MODI: దేశ ప్రజలకు ప్రధాని మోడీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈసారి దీపావళి సందర్భంగా దేశ ప్రజలు స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా వాటితో ఫొటోలు దిగాలని సూచించారు. ఆ చిత్రాలను నమో యాప్‌లో అప్‌లోడ్ చేయాలని హితవు కోరారు. దీంతో ప్రధాని మోడీ ఇచ్చిన స్పందనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘లోకల్ ఫర్ వోకల్’ నినాదానికి మద్దతుగా ఈ దీపావళికి దేశ ప్రజలందరూ స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దీపావళి సందర్భంగా స్థానికంగా తయారు చేసిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లోకల్ ఫర్ వోకల్ కు మద్దతుగా నిలవాలని కోరారు.
This Diwali, let us celebrate India’s entrepreneurial and creative spirit with #VocalForLocal threads on NaMo app. https://t.co/NoVknVXclo
Also Read
Buy products which have been made locally and then post a selfie with the product or the maker on the NaMo App. Invite your friends and…
— Narendra Modi (@narendramodi) November 8, 2023
ఈ దీపావళికి, ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువులతో సెల్ఫీలు తీసుకుని, వాటిని నమోయాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ ఏడాది దీపావళిని భారతదేశ సృజనాత్మక స్ఫూర్తితో, వ్యాపార సామర్థ్యంతో జరుపుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. ఆ ఉత్పత్తులతో సెల్ఫీలు తీసుకుని నమో యాప్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను చేర్చుకోవాలని పేర్కొన్నారు. స్థానిక ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి,భారతదేశ సంప్రదాయాన్ని పెంపొందించడానికి డిజిటల్ మీడియా శక్తిని ఉపయోగిస్తామని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్‌పై వెంటనే స్పందించారు.
పోస్ట్ చూసిన నెటిజన్లు తాము ఇప్పటికే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేశామని చెప్పారు. వాటికి సంబంధించిన చిత్రాలను కూడా అక్కడ పోస్ట్ చేశారు. గత నెలలో మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాను గతంలో ఇచ్చిన పిలుపు కారణంగానే దసరా పండుగకు దేశ ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశారన్నారు. ఈ స్ఫూర్తితో మన దేశంలో తయారైన ఉత్పత్తులను ప్రతి పండుగ రోజు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లోకల్ ఫర్ వోకల్ అనే నినాదానికి ఇది గొప్ప బలం చేకూరుస్తుందని ప్రధాని అన్నారు. దీనికి సంబంధించి ఈ దీపావళి పండుగ రోజున స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
Delhi AQI: ఢిల్లీలో విషపూరితంగా మారుతున్న గాలి నాణ్యత
తాజావార్తలు
-
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. మొదటి టాస్క్‌లో దుమ్మురేపిన ఝాన్సీ..
-
NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
-
Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!