Mann Ki Baat : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (డిసెంబర్ 31) తన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమం.
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు హడావిడిగా వెళ్లవద్దని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కోరారు.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రోడ్షో నిర్వహించి పునరాభివృద్ధి చెందిన అయోధ్య రైల్వే స్టేషన్ను ఆవిష్కరించిన అనంతరం కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి ఉత్తరప్రదేశ్ కోసం అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడ్డారని ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.. పేదలందరికీ భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని.. ఈ స్కీం కింద భారీ ఎత్తున.. రూ. 35,141 కోట్ల మేర దోపిడీ జరిగిందన్నారు.
డిసెంబర్ 30న ప్రారంభించనున్న అయోధ్యలోని విమానాశ్రయానికి 'మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్'గా నామకరణం చేశారు. ఈ విమానాశ్రయానికి రామాయణ పురాణ రచయితగా ప్రసిద్ధి చెందిన పురాణ కవి వాల్మీకి పేరు పెట్టారు.
యూరప్కు ముఖద్వారమైన ఇటలీ భారతీయులకు తలుపులు తెరిచింది. భారత్, ఇటలీ ఇటీవల 'మైగ్రేషన్ అండ్ మొబిలిటీ' ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందానికి భారత మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇటలీతో ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందాలను బలోపేతం చేయడమే కాకుండా అక్రమ వలసలను కూడా నిరోధించనుంది.
తమిళ నటుడు డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం బాధాకరం.. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్ అని పేర్కొన్నారు.
క్రెమ్లిన్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా అధినేతతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపించారు.