తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తమిళనాడులోని వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ, పునరుద్ధరణ, పునరావాస పనులు చేపట్టేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన లక్షద్వీప్ పర్యటన గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రధాని మోడీ తన పర్యటనకు సంబంధించిన పలు చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఫోటోల్లో ప్రధాని మోడీ విభిన్న స్టైల్స్‌లో కనిపిస్తున్నారు. ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో రూ.1,156 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి మెగా పుష్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనలో 2వ రోజు త్రిసూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బుధవారం కేరళలోని త్రిసూర్‌లో జరిగిన మహిళా సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ ఆశీస్సులు అందించిన మహిళా శక్తికి కృతజ్ఞతలు అని…
Oyo : గత శనివారం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడంతో అయోధ్య చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడవు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకోవడం లేదు అని ఆయన చెప్పారు.
Longest Sea Bridge: దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను జనవరి 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. లాంగెస్ట్ సీ బ్రిడ్జ్‌గా పేరొందిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటీహెచ్ఎల్)ని ప్రధాని ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదివారం తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఆయన స్వాగతం పలికారు.