మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు.. 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారకుండా భారత్ ను ఏ శక్తి అడ్డుకోలేదని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో నేను కూడాపోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుండే పోటీకి సిద్ధమన్న ఆయన.. నాది రాజమండ్రి.. నిర్ణయం అధిష్టానానిది అని పేర్కొన్నారు సోము వీర్రాజు
ఇవాళ్టి నుంచి ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’కు రెడీ అయింది. 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సీఈఓలో పాల్గొనే ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో భారతీయ పర్యాటకులు బుకింగ్లను రద్దు చేసుకుంటున్నారు. ఈ సంఘటనల మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా నుంచి ఎక్కువ మంది పర్యాటకులను తన దేశానికి పంపే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
భారత్, పాక్ దాయాది దేశాల మధ్య శత్రుత్వం గురించి తెలిసిన విషయం. శత్రువు ప్రాణాలతో దొరికితే విజయగర్వంతో ఆ దేశం మీసం తిప్పుతుంది. 2019 ఫిబ్రవరి 27 భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పట్టుబడిన సమయంలో పాక్లో అలాంటి పరిస్థితి లేదు. పాక్ ప్రధానితో సహా ఉన్నతస్థాయి అధికార గణమంతా వణికిపోయారు. రెండు రోజుల్లోనే వర్ధమాన్ను విడిచిపెట్టింది పాకిస్థాన్.
ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ప్రధాన మంత్రితో పాటు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమవుతారని అధికారులు తెలిపారు.
PM Modi: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ చారిత్రాత్మక విజయం సాధించింది. ప్రతిపక్ష బీఎన్పీ పార్టీలో పాటు ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో షేక్ హసీనాకు తిరుగు లేకుండా పోయింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ప్రధాని కాబోతున్నారు.
India-Maldives Row: భారత్-మాల్దీవ్స్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. లక్షద్వీప్ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాల్దీవ్స్ స్వాతంత్రాన్ని పొందినప్పటి నుంచి భారత్ అన్ని విధాలుగా ఆపన్న హస్తం అందిస్తున్నా.. ఆ దేశం మాత్రం చైనా పాట పాడుతూనే ఉంది. తాజాగా ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ చైనా అనుకూల, భారత వ్యతిరేఖ వైకరి ప్రదర్శిస్తున్నాడు.
Haryana:హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు, చౌదరి దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్కి లేఖ రాశారు. ప్రొఫెసర్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా.. అతడిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు.
Lakshadweep: ఇండియా-మాల్దీవ్స్ వివాదం నడుమ ‘‘లక్షద్వీప్’’ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారతదేశంలో మొన్నటి వరకు పెద్దగా భారతీయులే పట్టించుకోని ఈ ద్వీపాల గురించి ప్రస్తుతం ప్రపంచమే సెర్చ్ చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఒక్క పర్యటన లక్షద్వీప్ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ప్రపంచ టూరిస్టులు ఈ ఐలాండ్స్ గురించి ఇంటర్నెట్లో తెగవెతికేస్తున్నారు. సరైన విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరో మాల్దీవ్స్ అవుతాయంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.