PM Modi: వారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అనుకుంటున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థిపై పీఎం ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శన ధాటిని పెంచుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ దక్షిణ గోవా అభ్యర్థి వ్యాఖ్యలను ప్రధాని ప్రస్తావిస్తూ.. వారు రాజ్యాంగాన్ని అవమానించారని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత గోవాపై భారత రాజ్యాంగం బలవంతంగా ప్రయోగించబడిందని, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి తాను చెప్పాను’’ అని కాంగ్రెస్ సౌత్ గోవా అభ్యర్థి విరియాటో ఫెర్నాండెస్ సోమవారం ఓ బహిరంగ సభలో ప్రసంగించారు.
Read Also: Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే ముస్లిం చట్టం తెస్తారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘కాంగ్రెస్ గోవా అభ్యర్థి ఆ రాష్ట్రానికి భారత రాజ్యాంగ వర్తించదని చెబుతున్నారు. గోవాపై రాజ్యాంగం బలవంతంగా తీసుకువచ్చారని అతను స్పష్టంగా చెప్పాడు. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్ ‘షహజాదా(యువరాజు)తో చెప్పారు’’ అన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఇటీవల ప్రధాని మోడీ యువరాజు అని, కాంగ్రెస్ పార్టీని వంశపారంపర్య పార్టీగా అభివర్ణిస్తున్నారు.
‘‘ఇది బాబాసాహెబ్ అంబేద్కర్‌ని, రాజ్యాంగాన్ని అవమానించడం కాదా..? ఇది రాజ్యంగంతో జోక్యం చేసుకోవడం కాదా..? ఇదంతా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలో భాగమే. నేను గోవాలో రాజ్యాంగాన్ని నిరాకరిస్తున్నారు. భారతదేశం అంతటా బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరస్కరించడానికి ప్రయత్నించింది’’ అని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన మోడీ.. బీజేపీ పక్కన పెట్టండి, బాబా సాహెబ్ అంబేద్కర్ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ఇటీవల అన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!