తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 6వ తేదీన ఏపీలో పర్యటించిన ప్రధాని.. నేడు మరోసారి ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. రాజ్భవన్లో మంగళవారం రాత్రి బస చేయనున్నారు. అయితే ప్రధాని మోడీని మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కుటుంబం కలిసింది
PM Modi: లోక్సభ ఏడు విడతల్లో భాగంగా ఈ రోజు మూడో విడత ఎన్నికలు పూర్తయయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ.. కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. అనకాపల్లిలో సోమవారం జరిగిన ప్రధాని బహిరగసభ వేదికపై ప్రధాని నరేంద్రమోడీ తన గెలుపుకు మద్దతుగా తలపై…
PM Modi: లోక్సభ ఎన్నికల ఏడు దశల్లో ఈ రోజు మూడో దశ ముగిసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో పీఎం మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 543 ఎంసీ స్థానాల్లో బీజేపీ సొంతగా 370 సీట్లు, ఎన్డీయే కూటమిగా 400+ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సోమవారం ప్రధాని మోడీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా.. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుందని విమర్శించారు. మోడీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రైల్వే జోన్ పై మోడీ అవగాహన లేకుండా మాట్లాడారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలని ఘాటు వ్యాఖ్యలు…
PM Modi: ముస్లిం రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత, మాజీ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముస్లింల పూర్తి రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించడంపై వివాదం మొదలైంది.
పాకిస్థాన్పై కాంగ్రెస్ ప్రేమ గరిష్ట స్థాయికి చేరుతోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.
ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని అస్సలు సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జేడీఎస్ ఎంపీని దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించిందని, అభ్యంతరకర లైంగిక వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య ఉన్నందున ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.
లోక్సభ ఎన్నికల మూడో విడతలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రజలను కోరారు. "నేటి దశలో ఓటు వేసే వారందరినీ రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను మరింత చైతన్యవంతం చేస్తుంది" అని ప్రధాని మోడీ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.