తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు జేపీ నడ్డా ఫోన్ చేశారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే.. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అధ్యక్షునిగా పని చేసిన అనుభవం ఉందన్నారు. అలాగే.. తెలంగాణకు అధ్యక్షులుగా పని చేశాను.. అయితే పార్టీ మరోసారి నాపై ఈ బాధ్యత పెట్టింది.. బీజేపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచా.. పార్టీని ఎదీ ఎపుడు అడగలేదు అని కిషన్ రెడ్డి అన్నారు.
గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7), క్వాడ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సహా మూడు కీలక బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలలో ఆరు రోజుల పాటు పర్యటించనున్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల్లో ఎంత బిజీగా వున్నా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం ఆయన తన స్టయిల్ చూపిస్తారు. తాజాగా ఆయన చేతిలో చిడతలు, తుంబుర పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఇవాళ పూణేలో పర్యటించిన మోడీ డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరిట ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ పాలకమండలి సభ్యులు…