Pawan Kalyan Meets With PM Modi: ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఏం చర్చించారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం బీజేపీ కోర్‌కమిటీ సమావేశం అనంతరం పవన్‌తో ప్రధాని సమావేశం ఉండాలి. కానీ వర్షం కారణంగా ప్రధాని పర్యటన ఆలస్యం కావడంతో.. కోర్ కమిటీ సమావేశం కంటే ముందే పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీకి వపన్‌తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఏపీ రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం.ప్రధాని మోడీ-పవన్ భేటీ పై సర్వత్రా ఉత్కంఠ రేగిన సంగతి తెలిసిందే. ఏపీలో ఇటీవల జరిగిన తాజా పరిణామాలని మోడీ వద్ద ప్రస్తావించారు.

Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
Read Also: Pawan Kalyan: ఈనెల 13న విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
విశాఖలో పవన్ పర్యటనను అడ్డుకున్న ఘటన అంశాన్ని ప్రస్తావిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రుషికొండలో తవ్వకాలను చర్చించారని, తవకివ్వాల్సిన రోడ్ మ్యాప్ విషయాన్ని పవన్ ప్రస్తావించారని తెలుస్తోంది. వివిధ అంశాలతో కూడిన రిప్రజెటేషన్ను ప్రధానికి అందచేశారు పవన్ కళ్యాణ్. మూడేళ్ల తర్వాత ప్రధాని మోడీతో పవన్ భేటీ కావడంతో ఏం మాట్లాడారనేది ఆసక్తికరంగా మారింది.

అంతకుముందు విశాఖకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు. మధురైలో వర్షం కారణంగా విశాఖకు ఆరగంట ఆలస్యంగా చేరుకున్నారు. ప్రధాని మోడీ. బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఇది సాగింది. అనంతరం విశాఖ ఐఎన్‌ఎస్ చోళ గెస్ట్‌హౌస్‌కు ప్రధాని మోడీ చేరుకున్నారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. శనివారం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ నిర్వహంచనున్నారు. ప్రధాని మోడీ సభావేదికపై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రమే ఉంటారు. రేపటి సభలో 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.రూ.7,614 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు.
Read Also: Pawan Kalyan: ఈనెల 13న విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!