రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. ప్లాట్ ఫామ్ టికెట్లపై భారీగా వడ్డించింది.. కోవిడ్ నిబంధనల పేరుతో అదనంగా రూ. 20 పెంచేసింది రైల్వే శాఖ.. కోవిడ్ నియంత్రణ కోసం రద్దీని తగ్గించడానికి ప్లాట్ ఫాం చార్జీలను పెంచుతున్నామంటూ.. రూ.30 నుంచి రూ.50కి పెంచుతూ ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ ఓ ప్రకటన చేశారు.. కరోనా వ్యాప్తి వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు ప్లాట్‌ఫాంలకు చేరకుండా నియంత్రించడం కోసమే ఈ నిర్ణయమని ప్రకటనలో పేర్కొన్నారు.…