శీతాకాలం కావడంతో రష్యాలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో ఆ దేశంలో అత్యధిక ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. చలితో అక్కడి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేవు. కొన్ని ప్రాంతాల్లో నదులు కూడా గడ్డకట్టుకుపోయి అక్కడ నది ఉందో లేదో కూడా అర్థం కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి.