సీఎం జగన్ పై టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ పై ప్రజలకు నమ్మకం లేదని ఆయన ఆరోపించారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని విమర్శించారు.
Pithani Satyanarayana: తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ.. అయితే, పవన్ కల్యాణ్ టీడీపీతో కలవడానికి ముందుకు వస్తుంటే.. భారతీయ జనతా పార్టీ మాత్రం భయపెడుతుందని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. టీడీపీతో జనసేన కలవకుండా.. బీజేపీ ఎంత కాలం అడ్డుకుంటుందో చూస్తామన్నారు పితాని. మరోవైపు.. రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిషత్ ఎన్నికల ఫలితాలు కీలక పరిణామాలకు తెరలేపాయి.. ఇప్పటి వరకు దూరంగా ఉన్న టీడీపీ-జనసేన కలిసి ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 స్థానాలు, వైసీపీ 6 స్థానాలు, జనసేన 4 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలన్నా.. జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను…