ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్.. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరిసి అద్భుత విజయం సాదించిన టీమిండియా.. ఇక రెండో టెస్టుకు సిద్ధమైంది. అయితే అడిలైడ్‌లో గత పర్యటన అనుభవం భారత జట్టుకు హెచ్చరికలు పంపుతోంది. అడిలైడ్ మైదానంలో గత పర్యటనలో ఆడిన టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అందుకోలేదు. మయాంక్ అగర్వాల్ చేసిన…
భారత జట్టుకు శుభవార్త. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ప్రస్తుతం అడిలైడ్‌లో ఉన్న భారత జట్టుతో కలిశాడు. టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధతను దగ్గరుండి చూసుకుంటున్నాడు. అదే సమయంలో రెండో టెస్టు తుది జట్టుపై ప్రణాళికలు మొదలు పెట్టాడు. యశస్వీ జైస్వాల్‌తో కలిసి ఎవరిని ఓపెనర్‌గా పంపాలని మల్లగుల్లాలు పడుతున్నాడు. అయితే ఈ విషయంలో ఇప్పటికే గంభీర్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెర్త్ టెస్టు ముగిసాక…
ఇటీవలి కాలంలో ప్రతి సిరీస్‌లో ఒక్క డే/నైట్ టెస్టు (పింక్ టెస్టు) అయినా ఏర్పాటు చేయడం సాధారణమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో ఎక్కువగా పింక్ బాల్ టెస్టులు జరుగుతున్నాయి. భారత్ వేదికగా జరిగే సిరీసుల్లో మాత్రం పింక్ టెస్టు ఆడటం లేదు. చివరిసారిగా 2022లో శ్రీలంకతో భారత్ తలపడింది. ప్రపంచంలోనే ధనిక బోర్డు అయిన బీసీసీఐ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచులే జరిగాయంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. భారత్‌లో పింక్ టెస్టులు ఎందుకు నిర్వహించడం లేదో బీసీసీఐ…
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకువెళ్తోంది. రెండో రోజు ఆటలో మరో 10 ఓవర్ల ఆట మిగిలి ఉండగా రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రిషబ్ పంత్ (50), శ్రేయస్ అయ్యర్ (67) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్ (46), విహారి (35), జడేజా (22), మయాంక్ (22) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో జయవిక్రమ 4 వికెట్లు, ఎంబుల్‌దెనియా 3 వికెట్లు పడగొట్టారు. తొలి…
బెంగళూరు వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో (డే/నైట్) టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్సులో 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాటర్లలో మథ్యూస్(43), డిక్‌వెల్లా(21) తప్ప ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు, అశ్విన్, షమీ తలో 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఓవర్‌నైట్ స్కోరు 86/6తో రెండో రోజు ఆట ఆరంభించిన శ్రీలంకను చుట్టేయడానికి రోహిత్ సేనకు ఎంతో సమయం పట్టలేదు.…
స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న డే/నైట్ టెస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన జడేజా శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన జడేజా (175 నాటౌట్).. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో…