కాకినాడ రూరల్ టీడీపీ కో ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు పదవికి రాజీనామా చేశారు. కారణాలను వివరిస్తూ... పార్టీ అధిష్టానానికి సుదీర్ఘ లేఖ రాశారాయన. అదంతా ఒక ఎత్తయితే... ఈ పరిణామాల గురించి మాత్రం తెగ గుసగుసలాడేసుకుంటోంది లోకల్ టీడీపీ కేడర్. ఏ ప్రయోజనాలు ఆశించి పిల్లి ఈ స్టంట్స్ చేస్తున్నారన్నది కేడర్ క్వశ్చన్. అధికార పార్టీలో కో ఆర్డినేటర్ పదవి అంటే... ఒక స్థాయి, స్థానం ఉంటుంది. అలాంటి పోస్ట్‌ను కూడా పిల్లి దంపతులు ఎందుకు వివాదాస్పదం…
కాకినాడ రూరల్‌లో టీడీపీ పరిస్థితి ఉందా లేదా అన్నట్టు తయారైంది. పార్టీని నడిపేవారు లేక కేడర్ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇక్కడ నుంచి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా పిల్లి అనంతలక్ష్మి గెలిచారు. 2019లో పిల్లి అనంతలక్ష్మి.. అంతకుముందు 2009లో ఆమె భర్త సత్యనారాయణ కాకినాడ రూరల్‌లో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్దిరోజులు బాగానే పనిచేశారు. తర్వాతే పరిణామాలు మారిపోయాయి. అనంతలక్ష్మి కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఒక మహిళ పోలీసులకు…