అమర్‌నాథ్ యాత్ర ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. శ్రీనగర్‌లోని హిమాలయాల్లో ఉన్న బోలేనాథుడి దర్శనం కోసం బాల్టాల్, నునావన్ క్యాంపుల మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. హిమాలయాల్లోని దక్షిణ కశ్మీర్‌లో సుమారు 3880 మీటర్ల ఎత్తులోని ఓ గుహలో భక్తులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకోనున్నారు. నువాన్-పహల్గామ్ రూట్లో 48 కిలోమీటర్లు, బల్తాల్ రూట్లో 14 కిలోమీటర్ల మార్గంలో భక్తులు వెళ్తున్నారు.
మీరు కూడా ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ప్రణాళికను కలిగి ఉన్నారా..? యాత్ర కోసం కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈనెల 29 నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో టోకెన్ల స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. 1200 మెట్టు వద్ద స్కానింగ్ అనంతరం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. గతంలో ఆలయ తలుపుల నుంచి టోకెన్ వెళ్లే విధానాన్ని టీటీడీ అధికారులు మార్చారు. అయితే స్కానింగ్ పద్ధతి లేకపోవడంతో నడకదారిలో భక్తులకు పంపే టోకెన్లు పక్కదారి పడటంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనితో పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని టీటీడీ అధికారులు ఆదేశించారు.
Chardham Yatra : ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. ఈసారి చార్ధామ్ యాత్రకు వచ్చిన భక్తుల సంఖ్య పెద్ద రికార్డు సృష్టించింది.
Pilgrims Wait For Hours At Sabarimala Due To Heavy Rush: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగిపోతోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి వస్తున్న భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు వర్షాలు, చలి పెడుతున్నా.. అయ్యప్ప భక్తులు మాత్రం స్వామిని దర్శనం చేసుకోవటానికి వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం కేరళలో భక్తుల తాకిడి విపరీతంగా…
Pilgrims returning without visiting Sabarimala: కేరళలోని శబరిమల దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అయ్యప్ప స్వామి ఆలయంలో మండల-మకరవిళక్కు పూజలు కొనసాగుతుండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనానికి 12-18 గంటల సమయం పడుతోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లో భక్తులు వేచి చుస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో గంటల కొద్దీ వరుసల్లో వేచి ఉన్నా.. భక్తులకు అయ్యప్ప దర్శనం కావట్లేదు. దాంతో ఇతర…
ఉత్తరాఖండ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో చార్ ధామ్ టూర్ లో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండ చరియలు విరిగిపడటంతో నిన్నటి నుంచి రోడ్లపైనే యాత్రికులు ఉంటున్నారు.