ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఎదురుచూస్తోన్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది హైకోర్టు.. ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది.. దీంతో సినిమా విడుదలకు ఎలాంటి అడ్డుంకులు లేకుండా.. అన్నీ తొలగిపోయాయి.. కాగా, అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీం చరిత్రను వక్రీకరించారంటూ అల్లూరి సౌమ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారాజు, కొమ్రంభీంలను దేశభక్తులుగానే చూపామని హైకోర్టుకు నివేదించారు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ దర్శకనిర్మాతలు.. ఇక,…
తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు అంశంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దిపేటకు చెందిన సామాజిక కార్యకర్త కొండల్‌రెడ్డి పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం చెందింది. ఏప్రిల్ 6న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. రూ.6 లక్షలు చెల్లించేలా 2015లో ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు పిటిషనర్ కొండల్ రెడ్డి. జీవో జారీ చేసి ఆరేళ్లు దాటినా పరిహారం…
ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్ పర్యటన మధ్యలోనే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి రావడం పెద్ద రచ్చగా మారింది.. ఈ వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టింది.. భద్రతా లోపాల కారణంగా పంజాబ్పర్యటనను ప్రధాని మోడీ ఆకస్మికంగా ముగించిన వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌వేశారు సీనియర్అడ్వకేట్మణిందర్ సింగ్.. ఈ వ్యవమారంలో కేంద్ర ప్రభుత్వం పాటు పంజాబా్ సర్కార్‌కు నోటీసులు వెళ్లగా.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ఎన్వీ రమణ…
తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలయింది. పిల్ దాఖలు చేశాడు లా విద్యార్థి బొమ్మనగరి శ్రీకర్. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని…
ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలయింది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారన్నారు న్యాయవాది అభినవ్. దీనిపై విచారణ డిసెంబరు 6కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశం రాజకీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గుండెపోటు బారిన పడుతున్నారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని హైకోర్టులో దాఖలైన పిల్‌లో…
తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నేడు హైకోర్టు లో సిద్దిపేట మాజీ కలెక్టర్ రాజీనామాపై విచారణ జరగనుంది. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేశారు. రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించనుంది. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం…
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలయింది. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు పిటిషనర్లు. ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని, వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్లు. పిల్ ను లంచ్ మోషన్ గా స్వీకరించాలని…
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. ఈ ఘటనపై దసరా పండగ ముందు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ధర్మాసనం.. యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దయచేసి విచారణకు హాజరుకండి అంటూ నిందితుడికి సీఆర్‌పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పట్టింది. మిగతా కేసుల్లో నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని నిలదీసింది. కాగా, లఖింపూర్ ఉద్రిక్తతల్లో నలుగురు రైతులు…
అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఎన్నికల తర్వాత కూడా పశ్చిమ బెంగాల్‌లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.. దీనిపై రాజకీయ విమర్శలు దుమారమే రేపాయి.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు.. మరోవైపు.. బీజేపీయే ఈ హింసకు కారణమంటూ కామెంట్లు చేస్తూ వచ్చారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. అయితే.. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో బాధితుల పునరావాసానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది కోల్‌కతా హైకోర్టు… రాష్ట్ర…
కరోనా కష్టకాలంలోనూ ప్రైవేట్ ఆస్పత్రులు కనికరం చూపడంలేదు.. అందినకాడికి దండుకునే ప్రయత్నమే తప్పితే.. జాలిచూపే పరిస్థితిలేదు.. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కరోన కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ వేశారు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రజలకు అవుతున్న ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్న ఆయన.. ఆంద్రప్రదేశ్,…