Bichagadu 2 : విజయ్ ఆంటోని ఆరేళ్ల క్రితం నటించిన బిచ్చగాడు సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో గుర్తుందా? 2016లో వేసవి కానుకగా విడుదలైన ఈ అనువాదచిత్రం తమిళంలో కంటే కూడా తెలుగులోనే సూపర్ సక్సెస్ అందుకుంది.
తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే! తెలుగునాట సైతం ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్ట�